ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ శివాజీని బయటికి పంపించిన ప్రోమో చూసి చాలామంది నయని పావని కోసమే శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోయారని, మరికొందరు శివాజీ హెల్త్ రీజన్స్ వలనే బిగ్ బాస్ ఆయన్ని ట్రీట్మెంట్ కోసం బయటికి పంపారనే ఊహాగానాలు నడిచాయి. శివాజీ హౌస్ నుంచి బయటికి వెళుతుంటే మాత్రం హౌస్ మేట్స్ వద్దన్నా, మీరు వెళ్లొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. శివాజీని ఆపే ప్రయత్నం చేసారు.
అయితే శివాజీ చేతికి దెబ్బ తగలడం వలనే అతనికి ఎక్సరే తీయించి అసలు ప్రాబ్లెమ్ ఏమిటో తెలుసుకుని ప్రోపర్ ట్రీట్మెంట్ అందించేందుకే ఆయన్ని సడన్ గా బయటికి పంపించారు. ఐదో వారంలో శివాజీ ఓ టాస్క్ చేస్తున్నప్పుడు చేతికి గాయమైంది. అప్పటినుంచి ఆయన ఆడలేకపోతున్నాడు. అయితే బయటికి వెళ్ళిన శివాజీ చేతికి బెల్ట్ వేయించుకుని మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఈసారి హుషారుగా కనిపించాడు.
ఇక నేడు సోమవారం నామినేషన్స్ డే.. ఈరోజు ఆటగాళ్లు-పోటుగాళ్ళు అని కాకుండా అంతా కలిసిపోయి నామినేషన్స్ లో ఉండాల్సి వచ్చింది. ఇక పల్లవి ప్రశాంత్ vs సందీప్, టేస్టీ తేజ vs పల్లవి ప్రశాంత్, ప్రియాంక vs భోళా, భోళా vs అర్జున్ రాయుడు, ప్రియాంక vs అశ్విని , పూజ vs భోళా, పూజ vs అశ్విని అన్న రేంజ్ లో గొడవలు జరిగి నామినేషన్స్ జరిగినట్లుగా వదిలిన ప్రోమో వైరల్ అయ్యింది.