Advertisement
TDP Ads

హిందీ రామాయణంపై సాయి పల్లవి కామెంట్స్

Mon 16th Oct 2023 03:26 PM
sai pallavi  హిందీ రామాయణంపై సాయి పల్లవి కామెంట్స్
Sai Pallavi Commentaries on Hindi Ramayana హిందీ రామాయణంపై సాయి పల్లవి కామెంట్స్
Advertisement

హిందీలో రణబీర్ కపూర్ - సాయి పల్లవి కలయికలో రామాయణం తెరకెక్క్కబోతుంది అంటూ ఈ మధ్యన గట్టిగా ప్రచారం జరిగింది. హిందీలోనే కాకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరక్కెక్కనున్న ఈ అతి భారీ బడ్జెట్ మూవీలో సీత కేరెక్టర్ కోసం సహజనటి సాయి పల్లవిని సంప్రదించారు.. అది నిజంగా సాయి పల్లవి అదృష్టమే, ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైంది అన్నారు. అయితే నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న   చిత్రంపై ఇప్పటివరకు రకరకాలుగా ప్రచారాలు జరగడమే కానీ.. ఈ విషయమై ఎలాంటి అఫీషియల్ అనౌన్సమెంట్ లేదు.

తాజాగా సాయి పల్లవి తాను రామాయణం సినిమాలో సీత కేరెక్టర్ లో నటిస్తున్నాను అంటూ కన్ ఫమ్ చెయ్యడమే కాదు.. ఈ చిత్ర సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు చాలా ఆతృతగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. తనను దర్శకుడు నితీష్ తివారి సీతగా ఎలా చూసారో అనే విషయమే తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంటూ అసలు విషయాన్ని రివీల్ చేసింది. ఈ పాత్ర తనకి సవాల్ తో కూడిన పాత్రే అని, ఎప్పుడెప్పుడు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటానో అనే అతృతతో ఉన్నాను.. నిజంగా ఈ చిత్రంలో నటించడం తన అదృష్టమంటూ చెప్పుకొచ్చింది.

ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు ఉన్న నటులు సీత పాత్రలో కనిపించారు. వారిలో ఓ పది శాతం చేసినా నేను బాగా చేసినట్టే, ఈ చిత్రానికి సంబందించిన స్టోరీ సిట్టింగ్స్ కోసం ముంబై వెళుతున్నట్టుగా చెబుతూ హిందీ రామాయణంపై ఆసక్తికర విషయాలను సాయి పల్లవి పంచుకుంది. 

Sai Pallavi Commentaries on Hindi Ramayana:

Sai Pallavi Interesting Commentaries on Ramayana

Tags:   SAI PALLAVI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement