బిగ్ బాస్ సీజన్ 7 నుంచి అమ్మాయిలు ఎలిమినేట్ అవడం ఒక ఎత్తు, నిన్న ఆరోవారంలో నయని పావని ఎలిమినేట్ అవడం ఇంకో ఎత్తు. స్ట్రాంగ్ అన్న అమ్మాయిని ఎలా ఎలిమినేట్ చేస్తారు.. హౌస్ లో అశ్విని, పూజ, తేజ, భోళా లని వదిలేసి.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారా అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. అటు పల్లవి ప్రశాంత్ బయట గట్టి పీఆర్ టీమ్ ని మైంటైన్ చేస్తూ తనని హౌస్ లో విమర్శించే వాళ్ళని ట్రోల్ చెయ్యమని చెప్పినట్టుగా అమరదీప్ ని అతని ఫ్యామిలీని పల్లవి పీఆర్ టీమ్ ట్రోల్ చేస్తుంది. అమరదీప్ తల్లి, భార్యపై పల్లవి ప్రశాంత్ అభిమానులంటూ నీచమైన కామెంట్స్ పెడుతున్నారు.
మరోపక్క సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ తన భర్తని తిడుతున్న నాగార్జునపై ఫైర్ అవుతుంది. ఇవన్నీ నాగార్జున హోస్టింగ్ పై నెటిజెన్స్ లో తీవ్ర వ్యతిరేఖత పెంచేలా కనబడుతుంది. బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ టాగ్ తో అభిమానులని సెట్ చేసుకున్నాడు, అయితే పల్లవి ప్రశాంత్ అభిమానులపై అమరదీప్ తల్లి ఫైరవుతుంది. మీకు పల్లవి ప్రశాంత్ గొప్ప అయితే మాకేంటి, మమ్మల్ని ఎందుకిలా నీచంగా మాట్లాడుతున్నారు.
ఇది ఇక్కడితో ఆపకపోతే నేను హోస్ట్ నాగార్జున గారి దగ్గరకి వెళ్లి కంప్లైంట్ చేస్తాను, మీ నీచమైన మాటలతో ఎంత బాధపడుతున్నామో మీకేమన్నా తెలుసా అంటూ ఆవిడ ఏడ్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున కూడా ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యకుండా ఉండాలని నెటిజెన్స్ కోరుకుంటున్నారు.