Advertisementt

స్టార్స్ పై తాప్సి సెన్సేషనల్ కామెంట్స్

Mon 16th Oct 2023 01:32 PM
taapsee pannu  స్టార్స్ పై తాప్సి సెన్సేషనల్ కామెంట్స్
Taapsee Sensational Comments on Stars స్టార్స్ పై తాప్సి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

తెలుగులో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చెయ్యలేక బాలీవుడ్ కి మకాం మార్చిన తాప్సి పన్ను.. అక్కడ కూడా స్టార్ హీరోలతో జోడి కట్టడం లేదు. కానీ సోలో హీరోయిన్ గా హీరోయిన్స్ సెంట్రిక్ మూవీస్ తో తనకంటూ ఓ ప్రత్యేకతని చాటుకుంటుంది. అయితే బాలీవుడ్ లో కాస్త నిలదొక్కుకునే.. సౌత్ దర్శకులని విమర్శించింది. సౌత్ డైరెక్టర్స్ కేవలం గ్లామర్ నే చూస్తారు కానీ.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు హీరోయిన్స్ కి ఇవ్వరు అంది.

పోన్లే బాలీవుడ్ లో నిలబడింది సౌత్ మీద ఏదో కామెంట్స్ చేసింది అనుకుంటే.. అక్కడ బాలీవుడ్ లోను ఆమెకి హీరోల పక్కన నటించే ఛాన్స్ మాత్రం రావడం లేదు. ఇక ఇప్పుడు నిర్మాత అవతారమెత్తింది. తాప్సి హీరోయిన్ గానే కాదు నిర్మాతగా మారి ఓ సినిమాని నిర్మించింది. వీక్ ధక్ మూవీని నిర్మించి విడుదల చేసే క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై తాప్సి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సినిమా అనేది స్టార్స్ చుట్టూనే తిరుగుతుంది అంటూ సంచలనంగా మాట్లాడింది.

ఇండస్ట్రీలో ప్రముఖ నటులకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్స్ ఎవరూ సినిమాల్లో కనిపించకపోతే దానిని థియేటర్స్ లో విడుదల కానివ్వకుండా ఓటిటీలలోకి తోసేసి ప్రయత్నం జరుగుతుంది. భారీ చిత్రాలు చిన్న సినిమాలని తొక్కేయాలని చూస్తున్నాయి.. ఇది ఎంత మాత్రమూ మంచి కాదు అంటూ తాప్సి మాట్లాడింది. 

Taapsee Sensational Comments on Stars:

Taapsee Pannu Shocking Comments On Cinema Industry

Tags:   TAAPSEE PANNU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ