Advertisementt

దేవుడి దయతో పెళ్ళంటున్న కుర్ర హీరో

Sun 15th Oct 2023 07:37 PM
daggubati abhiram  దేవుడి దయతో పెళ్ళంటున్న కుర్ర హీరో
Abhiram Daggubati Getting Ready To Marriage దేవుడి దయతో పెళ్ళంటున్న కుర్ర హీరో
Advertisement
Ads by CJ

దగ్గుబాటి కుర్ర హీరో అభిరామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు, అభిరామ్ తన మేనత్త కూతురినే వివాహం చేసుకోబోతున్నాడు, ఇది పెద్దలు కుదిర్చిన వివాహం, అభిరామ్ పెళ్లిని దగ్గుబాటి ఫ్యామిలీ శ్రీలంకలో ప్లాన్ చేసింది అంటూ నిన్నమొన్నటివరకు చాలా రకాల వార్తలు కనిపించాయి. అహింసా మూవీ ప్లాప్ తర్వాత అభిరామ్ మరో ప్రాజెక్ట్ కి చాలా ఎక్కవ బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా అభిరామ్ పెళ్లి పై స్పందించాడు. 

అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే, దేవుడు కరుణిస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ అభిరామ్ చెప్పుకొచ్చాడు. తన పెళ్లి విషయం మొత్తం తన ఫ్యామిలీనే చూసుకుంటుంది, వారేమి మంచిదో అని ఆలోచించి చెబితే అదే తాను ఫాలో అవుతాను అంటూ అభిరామ్ తన పెళ్లి పెద్దలు కుదుర్చిన వివాహమే అంటూ చెప్పకనే చెప్పేసాడు. అంతేకాకుండా తాను ఎవరితో ప్రేమలో లేను, ఏ అమ్మాయి కూడా తన మనసులో లేదు అని అభిరామ్ ఈ దెబ్బకి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. 

తాను అహింసా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను, తేజ దగ్గర చాలా మెళుకువలు తెలుసుకున్నాను, తన వద్ద పది పన్నెండు స్క్రిప్ట్ లు ఉన్నాయని.. అన్నీ చూసుకుని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటిస్తాను అంటూ అభిరామ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. 

Abhiram Daggubati Getting Ready To Marriage:

Daggubati Abhiram Marriage On Cards

Tags:   DAGGUBATI ABHIRAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ