Advertisementt

బీఆర్ఎస్ మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే

Sun 15th Oct 2023 04:01 PM
cm kcr  బీఆర్ఎస్ మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే
BRS manifesto is full of welfare schemes బీఆర్ఎస్ మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే
Advertisement

అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో చాలా కీలకం. సక్సెస్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌లో ఒకటి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తాము ఇచ్చే హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తాం. ఆసక్తికర విషయం ఏంటంటే.. గత మేనిఫెస్టోలో చెప్పని విషయాలను సైతం ఈసారి బీఆర్ఎస్ టచ్ చేసింది. కేసీఆర్ మేనిఫెస్టోను చూస్తుంటే ఇతర రాష్ట్రాల ఎన్నికల హామీలన్నీ బాగా స్టడీ చేసి మరీ రూపొందించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. మరి సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ఎలా ఉంది? ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారనేది చూద్దాం.

సీఎం కేసీఆర్‌ హామీలు..

రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ రైతు బీమా తరహాలో కేసీఆర్‌ బీమా 

రాష్ట్రంలో 93లక్షల కుటుంబాలకు ‘కేసీఆర్‌ బీమా-ఇంటింటికీ ధీమా’ పథకంతో లబ్ది 

రూ.5లక్షల బీమాను ఎల్‌ఐసీ సంస్థ ద్వారా చెల్లింపు 

ఆసరా పింఛన్లు రూ.3వేలకు పెంపు. దశల వారీగా ఆసరా పింఛన్లు మొత్తాన్ని ఏటా రూ.500ల చొప్పున రూ.5వేలకు పెంచుతాం.

దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంపు.దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలు ఆపై ఏటా రూ.300ల చొప్పున పెంచుతాం

సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తాం 

బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం

అక్రిడేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌. ఉద్యోగుల తరహాలో కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా

రైతు బంధు మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతాం. తొలి ఏడాది రూ.12వేల వరకు పెంపు. 

పవర్‌ పాలసీ, అగ్రికల్చర్‌ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తాం. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతాం.

తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తాం. 

భవిష్యత్‌లోనూ గిరిజనులకు మరిన్ని పథకాలు.

దళిత బంధు, రైతు బీమా కొనసాగింపు

గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. 

లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం.

BRS manifesto is full of welfare schemes:

CM KCR Manifesto 2023

Tags:   CM KCR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement