Advertisementt

నార్త్ ని గట్టిగానే సెట్ చేసిన రవితేజ

Sun 15th Oct 2023 10:40 AM
ravi teja  నార్త్ ని గట్టిగానే సెట్ చేసిన రవితేజ
Ravi Teja set North audience నార్త్ ని గట్టిగానే సెట్ చేసిన రవితేజ
Advertisement
Ads by CJ

ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రవితేజ ఎప్పుడూ లేనిది టైగర్ నాగేశ్వరావు సినిమాని ముంబైలో నార్త్ ఆడియన్స్ ని సెట్ చేసుకున్నాడు. తెలుగులో జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ తో సరిపెడుతున్న రవితేజ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరా మూవీని ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి చేరువ చేసేందుకు ముంబైలోనే ఎక్కువ సమయం గడిపాడు. అక్కడ హిందీలో పాపులర్ షోస్ లో పాల్గొన్నాడు. కపిల్ శర్మ షో, శిల్ప శెట్టి డాన్స్ షో ఇలా ఏ ప్లాట్ ఫామ్ ని వదులుకోలేదు.

కానీ తెలుగులో రవితేజ కనిపించి చాలా రోజులవుతుంది. సినిమా విడుదలకు వారం రోజుల సమయం కూడా లేదు. ఇక్కడ ఈ రోజు ఆదివారం ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. మరి రేపు సోమ, మంగళవారాల్లో మీడియా ఇంటరాక్షన్స్ ఎమన్నా ఉంటాయేమో.. కానీ రవితేజ నార్త్ ఆడియన్స్ కి టైగర్ చేరువయ్యేలా చేసినట్టుగా తెలుగు ఆడియన్స్ ని పట్టించుకున్న సందర్భం కనిపించలేదు. గతంలో ప్రమోషన్స్ విషయంలో రవితేజఫై విమర్శలు కూడా ఉన్నాయి.

ఇక దర్శకుడు వంశీ మాత్రం హీరోయిన్స్ ని తీసుకుని తెలుగులో పాపులర్ షోస్ అయిన ఢీ డాన్స్ షో లాంటి వాటిలో టైగర్ నాగేశ్వరావు ని ప్రమోట్ చేస్తున్నాడు. కానీ రవితేజ మాత్రం కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కనిపిస్తాడని టాక్. 

Ravi Teja set North audience:

Ravi Teja concentrating on North Bastion

Tags:   RAVI TEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ