Advertisementt

బిగ్ బాస్ 7 లోకి ఆ ముగ్గురు రీ ఎంట్రీ

Sat 14th Oct 2023 07:43 PM
bigg boss 7 telugu  బిగ్ బాస్ 7 లోకి ఆ ముగ్గురు రీ ఎంట్రీ
3 contestants Re-Entry In Bigg Boss 7 Telugu బిగ్ బాస్ 7 లోకి ఆ ముగ్గురు రీ ఎంట్రీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 కొత్తకొత్తగా అంటూ ఉల్టా పుల్టా అంటూ కింగ్ నాగార్జున వారానికో సినిమా వేస్తున్నారు. ఐదు వారాల్లో ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వగా.. ఐదో వారంలో ఐదుగురు కొత్తవాళ్ళని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించారు. ఇక ఈ వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అంటూ వార్తలొస్తున్నాయి. ఈలోపులో శనివారం నాగర్జున ఎపిసోడ్ ప్రోమో వదిలారు.

ఈ ప్రోమోలో కెప్టెన్ అయిన ఒక్కరోజులోనే యావర్ యాటిట్యూడ్ చూపించాడంటూ హౌస్ మేట్స్ మాట్లాడుకోవడమే కాదు.. నాగార్జున కూడా యావర్ ని నించోబెట్టి అడిగారు. యావర్ కి అమర్ కి మధ్యన జరిగిన గొడవని, మధ్యలో సందీప్ ఎంటర్ అయిన విషయాన్ని ప్రోమో వేసి మరీ వీడియో చూపించారు. ఈలోపులో ఉల్టా పుల్టా అంటూ మరో వింత చూపించారు.

అది బిగ్ బాస్ సీజన్ పూర్తయ్యే చివరి రోజుల్లో ఎలిమినేట్ అయిన వారంతా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ ని కూల్ చేసి చిల్ చేసి సరదాగా ఆటపాటలతో ఆడుతూ ఉంటారు. కానీ ఈ సీజన్ లో ఆరోవారం చివరిలో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సుబ్బు, రతిక, సింగర్ యామిని రీ ఎంట్రీ ఇచ్చారు. మరి వారు హౌస్ లో ఉండిపోతారా లేదంటే ఈరోజు గెస్ట్ లుగా వచ్చారో అనేది పూర్తి ఎపిసోడ్ లో మరికాసేపట్లో అన్నట్టుగా ప్రోమో వదిలారు.  

3 contestants Re-Entry In Bigg Boss 7 Telugu:

Subhashree and Damini Re-Entry In Bigg Boss 7 Telugu 

Tags:   BIGG BOSS 7 TELUGU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ