ఏజెంట్ మూవీ డిసాస్టర్ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాని ప్రకటించని అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం ఏజెంట్ లుక్ నే కంటిన్యూ చేస్తున్నాడు. రీసెంట్ గా అక్కినేని నాగేశ్వరావు విగ్రహావిష్కరణలో అఖిల్ హెయిర్ ముడికట్టి ఏజెంట్ గా కండలు పెంచే కనిపించాడు. అయితే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అక్కినేని అభిమానుల్లో చాలా ఆత్రుత పెరిగిపోతుంది. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తో అఖిల్ సరికొత్తగా రాబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఆ చిత్రానికి ధీర టైటిల్ పెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
ప్రస్తుతం అఖిల్ ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. ఈలోపులో అఖిల్ ఓ సర్జరీ చేయించుకుంటున్నాడంటూ మరో న్యూస్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అఖిల్ హాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో కనిపించేందుకు ముక్కుకి కాస్మొటిక్ సర్జరీ ఏదో ప్లాన్ చేసుకున్నాడని, ఈ సర్జరీ కోసం అఖిల్ విదేశాలకు వెళ్లబోతున్నాడట. ఇందులో నిజమెంతుందో కానీ.. అఖిల్ సర్జరీ విషయం మాత్రం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.
ఇక ప్రస్తుతం అఖిల్ ఎక్కువగా జిమ్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనిల్ కుమార్ తో అఖిల్ చెయ్యబోయే మూవీ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి అఖిల్ ఎప్పుడెప్పుడు కొత్త సినిమా కబురందిస్తాడో అని అక్కినేని అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.