మహానటిగా బరువు పెరిగి తర్వాత సమస్యలు ఎదుర్కొని స్టార్ ఛాన్సెస్ వచ్చినా సక్సెస్ దరి చేరని కీర్తి సురేష్ కి ఈమధ్యన కాస్త లక్కు కలిసొచ్చి అవకాశాలు క్యూ కడుతున్నాయి. సర్కారు వారి పాట సో సో హిట్ ఇచ్చినా అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. ఈలోపులో భోళా శంకర్ తో భారీ డిసాస్టర్ అందుకున్న కీర్తి సురేష్ అటు తమిళనాట మహా బిజీగా కనిపిస్తుంది. బరువు తగ్గి గ్లామర్ పెంచిన కీర్తి సురేష్ గ్లామర్ షోకి రెడీ అయ్యింది.
అయినప్పటికీ అవకాశాలు కాస్త దూరంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలు చేసుకుంటున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తాను చేసే వర్కౌట్ ఫొటోస్, యోగ చేస్తున్న పిక్స్, తన పెట్స్ తో ఆడుకుంటున్న ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకి చేరువలో ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్ జిమ్ లో పుషప్స్ చేస్తున్న వర్కౌట్ పిక్ ని షేర్ చేసింది. అందులో కీర్తి సురేష్ పుషప్స్ చేస్తూ శ్రమిస్తుంది.
ఇక కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని ఒకసారి, కాదు ఆమె చిన్ననాటి స్నేహితుడు బిజినెస్ మ్యాన్ తో కీర్తి పెళ్లంటూ జరిగిన ప్రచారానికి కీర్తి సురేష్ తండ్రి చెక్ పెట్టారు. కీర్తి సురేష్ ఇప్పట్లో పెళ్లి చేసుకోదు అని ఆయన తెగేసి చెప్పారు.