సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ద రైజ్ ప్యాన్ ఇండియా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏకంగా నేషనల్ అవార్డు నే కైవసం చేసుకున్నాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప కి సీక్వెల్ గా పుష్ప ద రైజ్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఆగష్టు 15 2024 లో పుష్ప 2 రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేపనిలో ఉన్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అల్లు అర్జున్-రష్మిక ఇంకా కొందరు యాక్టర్స్ పై ఒక మెయిన్ సీక్వెన్స్ కి లీడ్ గా వచ్చే సీన్స్ చిత్రీకరిస్తున్నారని సమాచారం.
అయితే రెండు రోజుల్లో ఢిల్లీలో జరిగే నేషనల్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ కోసం అల్లు అర్జున్ రెండు రోజుల పాటు పుష్ప ద రూల్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఢిల్లీ వెళ్లి స్వయంగా అవార్డు అందుకోబోతున్నాడని తెలుస్తుంది. అక్కడి నంచి రాగానే మళ్ళీ పుష్ప ద రూల్ షూటింగ్ కి వెళ్ళిపోతాడట. వచ్చే జనవరి కల్లా షూటింగు కంప్లీట్ చేస్తే.. ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ తో సుకుమార్ బిజీ అవ్వాలని చూస్తున్నాడట.
ఈసారి ప్రమోషన్స్ పరంగా రెండు నెలల సమయం కేటాయించాలని, అలాగే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ పుష్ప ద రూల్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.