టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి సంక్రాంతి అంటే విపరీతమైన సెంటిమెంట్. చిన్న సినిమాలని కూడా స్టార్ హీరోల సినిమాలతో పోటీ పెట్టి సంక్రాంతికి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే దిల్ రాజు సంక్రాంతి స్లాట్ వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడు. రామ్ చరణ్ తో చేసే గేమ్ ఛేంజర్ ని సంక్రాంతికి విడుదల చేద్దామని దిల్ రాజు అనుకున్నా దానిని దర్శకుడు శంకర్ పడనివ్వలేదు. సరే గేమ్ ఛేంజర్ లెకపొతేనేమి.. ఆయన తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఉందిగా.
విజయ్ దేవరకొండ-పరశురామ్ కలయికలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్(టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు) మూవీ షూటింగ్ చక చకా పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే సంక్రాంతి సీజన్ కి ఫ్యామిలీ స్టార్ ఫిక్స్ అని బయ్యర్లకి కబురందించారని సమాచారం.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహేష్ గుంటూరు కారం తో వచ్చినా, వెంకటేష్ మూవీ వచ్చినా, విజయ్ దేవరకొండ మాత్రం VD13 తో రావడం పక్కా అంటున్నారు.