గుంటూరు కారం మూవీ ఫస్ట్ సింగిల్ పై సోషల్ మీడియాలో అభిమానులతో పాటుగా.. కొంతమంది జర్నలిస్టు లు వైరల్ అయ్యే క్రమంలో తప్పుడు సమాచారమిస్తూ అభిమానుల ఆత్రుతతో ఆడుకుంటున్నారు. ఇదిగో ఫస్ట్ సింగిల్ వస్తుంది, అదిగో గుంటూరు కారం నుంచి దసరాకి సర్ ప్రైజ్ రెడీ అవుతుంది అంటూ రకరకాల వార్తలు చూసి మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు వినాయక చవితికి ఇదే జరిగింది. అప్పుడు అభిమానులు డిస్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు కానీ.. కొంతమంది పనిగట్టుకుని గుంటూరు కారంపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.
ప్రస్తుతం థమన్ భగవంత్ కేసరి విడుదల మూడ్ లో ఉన్నాడు. రేపు గురువారం విడుదల కాబోతున్న భగవంత్ కేసరికి సంబందించిన వర్క్ మొత్తం కంప్లీట్ చేశాకే థమన్ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై కూర్చుంటాడట. అంటే ఇప్పటివరకు గుంటూరు కారంకి సంబందించిన ఫస్ట్ సింగిల్ వర్క్ ఏది పూర్తి కాలేదు అని తెలుస్తోంది. అటు సాంగ్ చిత్రీకరణ పూర్తవ్వలేదు. మరి అలాంటప్పుడు దసరాకి ఎలా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ వదులుతారు.
దసరా స్కిప్ అయినా.. వెంటనే కొద్దిరోజుల్లో దీపావళి ఫెస్టివల్ ఉంటుంది. అప్పటికి ప్రోపర్ గా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ వదులుతారేమో.. కానీ ఈలోపులోనే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మహేష్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.