Advertisementt

మోక్షజ్ఞా మోసం ఏం లేదు కదా..

Fri 13th Oct 2023 07:00 PM
mokshagna  మోక్షజ్ఞా మోసం ఏం లేదు కదా..
Exciting News On Mokshagna Debut మోక్షజ్ఞా మోసం ఏం లేదు కదా..
Advertisement
Ads by CJ

తెలుగునాట ఏ పర్వదినమొచ్చినా ఆ పండగరోజున నందమూరి మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఎనౌన్సమెంట్ వస్తుంది అని అప్పుడు మరింత పండగ చేసుకుందామని ఆశిస్తూ ఉంటారు నందమూరి అభిమానులు, మరీ ముఖ్యంగా బాలయ్య బర్త్ డే వచ్చిందంటే ఆయన నోటి వెంట మోక్షు సినిమా మాట వస్తుందనే ఆశతో ఆత్రంగా ఎదురు చూడడం ఆపై నిరాశకు లోనవడం గత కొన్నేళ్లుగా అలవాటైపోయింది. కానీ ఇన్నాళ్లు అభిమానుల ఆరాటాన్ని అంతగా పట్టించుకొని బాలయ్య బాబులో ఈమధ్య మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మోక్షజ్ఞని తరచుగా తన వెంట తిప్పుకోవడం, షూటింగ్ వాతావరణానికి, వ్యక్తులకి అలవాటు చెయ్యడం, తానేంతవరకు శిక్షణ పొందాడో పరీక్షించడం వంటివి చేస్తూ ఇక మోక్షజ్ఞ తెరంగేట్రం సమయం ఆసన్నమైంది అనే సంకేతాలిస్తున్నారు.

అలాగే ఈ మధ్య వరకు కాస్త బొద్దుగా కనిపించి కంగారు పెట్టిన మోక్షజ్ఞ ఇప్పుడు మాత్రం పూర్తిగా షేపప్ అయ్యి తాను సాలిడ్ మాస్ హీరో మెటీరియల్ అని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కలిగిస్తున్నాడు. దానితో ఫాన్స్ లో ఉత్సహం ఉరకలు వేస్తుంది.  ఎప్పుడెప్పుడు మోక్షు కెమెరా ముందుకు వస్తాడా ఎంత తొందరగా తనని తెరపైన చూద్దామా అనే ఊహల్లో మునిగి తేలుతున్నారు.

ఈ అభిమానులందరికి మరింత ఊపునిచ్చేలా సాగింది భగవంత్ కేసరి ఈవెంట్ లో బాలయ్య ప్రసంగం. నేను యంగ్ హీరోగా ఎంటరవుతున్నప్పుడు నీకు శ్రీలీల అవసరమా అంటూ నాకే షాకిచ్చాడు అనగానే ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. ఇక తాజాగా వినిపిస్తోన్న మరో కబురు ఏమిటంటే విజ్ఞాలన్నిటిని ఆమడదూరంలో అణిచిపెట్టే బాలకృష్ణ విజయదశమి రోజున తన తనయుడి తొలి సినిమా ప్రకటనకు ముహుర్తం నిర్ణయించారని వినికిడి. ప్రస్తుతానికైతే ఈవార్త విపరీతంగా వైరలయ్యింది. అంతటా వేడి పుట్టిస్తుంది. మరి ఈసారైనా ఆ శుభముహూర్తాన్ని వీక్షించగలమా.. ఎన్నో ఏళ్ళ నిరీక్షణకు తెర దించుతూ మోక్షు పై బాలయ్య క్లాప్ కొట్టే క్షణాలను ఆస్వాదించగలమా.. వేచి చూడాలి.

మోక్షజ్ఞా ఈసారేం మోసం లేదు కదా.. ఈ దసరాకైనా మా సరదా తీర్చు బాబు అనేది అభిమానుల విజ్ఞప్తి. 

Exciting News On Mokshagna Debut:

Mokshagna debut project announcement on Auspicious Day

Tags:   MOKSHAGNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ