సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్ పోన్ అవడంతో చాలా లాంగ్వేజ్ కి సంబందించిన సినిమాలు హడావిడిగా కాకుండా కూల్ గా సెప్టెంబర్ 28 న రిలీజ్ అయ్యాయి. అయితే సలార్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని చాలామంది చాలా ఎదురు చూసారు. సలార్ ఫైనల్ గా డిసెంబర్ 22 న స్తుంది అని మేకర్స్ ప్రకటించగానే వెంకటేష్, నితిన్ తమ సినిమాలని పోస్ట్ పోన్, ప్రీ పొన్ చేసుకున్నారు. అయితే తెలుగులో చిన్న హీరోలు సైడ్ అయ్యారు ఓకె. కానీ హిందీలో మాత్రం షారుఖ్ డుంకి సలార్ తో పోటీ పడేందుకు సిద్ధమైంది.
షారుఖ్ ఖాన్ డుంకి కి డిసెంబర్ లో క్రిష్టమస్ కి విడుదల అని ఎప్పుడో ప్రకటించారు. మధ్యలో సలార్ వచ్చింది. దానితో ప్రభాస్ vs షారుఖ్ ఖాన్ ఖచ్చితంగా బాక్సాఫీసు దగ్గర పోటీపడతారని, ఇద్దరిలో గెలుపెవరిదో... ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఉన్న షారుఖ్, రెండు ఘోరమైన డిజాస్టర్స్ తో ఉన్న ప్రభాస్ పోటీ పడి ఎవరు గెలుస్తారో అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు షారుఖ్ డుంకి ని వాయిదా వేస్తున్నట్టుగా వచ్చే డిసెంబర్ క్రిష్ట్మస్ కి సినిమా పోస్ట్ పోన్ అయినట్లుగా ప్రకటించారు. అంటే అఫీషియల్ గా డుంకి సలార్ పై పోటీ పడడం ఎందుకు అని కూల్ గా తప్పుకుంది. ఇక త్వరలోనే డుంకి రిలీజ్ డేట్ మేకర్స్ అనౌన్స్ చేస్తారని చెప్పారు.