Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్

Fri 13th Oct 2023 11:51 AM
ustad bhagat singh  ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్
Ustad Bhagat Singh Update ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఈమధ్యన హరీష్ శంకర్ కి అప్పుడప్పుడు అందుబాటులోకి వస్తున్నారు. ఏపీ రాజకీయాలతో యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్ కొద్దిరోజులు సినిమాలవైపు చూడరు అనుకుంటే.. దానికి విరుద్ధంగా ఉస్తాద్ భగత్ సింగ్-OG కోసం డేట్స్ కేటాయించేసారు. సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ తో OG షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నాడు. అటు హరీష్ శంకర్ కూడా పవన్ ఇచ్చే డేట్స్ ని బట్టి షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 

ఇక ఈ నెల 20 అంటే దసరాకి రెండురోజుల ముందు నుంచి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. ఈ నెల 20 ఉస్తాద్ సెట్స్ లో పవన్ ఉంటారంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి అనుకూలంగానే ఆయన చేస్తున్న షూటింగ్స్ నడుస్తున్నాయి. 

అటు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రోపర్ గా కనిపించడం లేదు. అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగ్స్ లో మాత్రం కనబడుతున్నారు. ఎలక్షన్స్ సమయం దగ్గరపడుతోంది.. పవన్ తన మార్క్ ఏపీ రాజకీయాల్లో ఎంతమేర చూపిస్తారో చూడాలి. 

Ustad Bhagat Singh Update:

Ustad Bhagat Singh shooting update

Tags:   USTAD BHAGAT SINGH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ