Advertisementt

వావ్ టీకాంగ్రెస్.. వాట్ ఏన్ ఐడియా..!

Fri 13th Oct 2023 11:03 AM
t congress  వావ్ టీకాంగ్రెస్.. వాట్ ఏన్ ఐడియా..!
Wow T congress.. what an idea..! వావ్ టీకాంగ్రెస్.. వాట్ ఏన్ ఐడియా..!
Advertisement
Ads by CJ

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణలో వాతావరణం హాట్ హాట్‌గా మారిపోయింది. పార్టీలు వ్యూహాలు.. ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో అత్యవరసర సమావేశమై మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 16వ తేదీన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇదే సభలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వెళితే చాలా స్ట్రాటజికల్‌గా ముందుకు వెళుతోంది. ఈ పార్టీ కూడా మేనిఫెస్టోను ఫైనలైజ్ చేసే స్థితిలో ఉంది. 

ఇక ఈ పార్టీ గతంలో ఏ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోను రూపొందిస్తుంది. ఈ మేనిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఐడియాతో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సమస్యను పరిగణలోకి తీసుకుంటోంది. ఎవరైనా.. ఏదైనా విజ్ఞప్తి చేస్తే.. అది ఆమోదయోగ్యంగా కన్సిడర్ చేస్తూ మేనిఫెస్టోలో పొందుపరచాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్లో ఎక్కువగా.. రాష్ట్రంలోని చేతి వృత్తిదారులకు ఉచిత కరెంటు, వక్ఫ్ బోర్డు ఆస్తులను జ్యుడీషియల్ పరిధిలోకి తీసుకురావాలి... వివిధ కులాలకు చెందిన సంఘాలు, వికలాంగులు తదితర వర్గాల నుంచి వినతులు వస్తున్నాయట.

వక్ఫ్ బోర్డు ఆస్తులను జ్యుడీషియల్ పరిధిలోకి తెచ్చే అంశాలను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ఎంఐఎంతో బీఆర్ఎస్ పార్టీ స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ముస్లిం సామాజిక వర్గంలో ఓట్లను కోల్పోకుండా ఉండేందుకు గానూ.. మైనారిటీల నుంచి వెల్లువెత్తుతున్న సమస్యలకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అలాగే చేనేత కార్మికుల సమస్యలను సైతం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ పూర్తి ప్రక్షాళన చేయాలంటూ విద్యార్థి వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా ఏ వర్గం నుంచి ఎలాంటి విజ్ఞప్తి వచ్చినా అది సబబనిపిస్తే చాలు.. పక్కాగా మేనిఫెస్టోలోకి తీసుకుంటోంది. మొత్తానికి ఇప్పటి వరకూ తెలంగాణలో ఏ పార్టీ అవలంభించని మార్గాన్ని కాంగ్రెస్ అవలంభిస్తోంది.

Wow T congress.. what an idea..!:

T Congress idea superb

Tags:   T CONGRESS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ