Advertisementt

గేమ్ ఛేంజర్ పై అది నమ్మకండి

Fri 13th Oct 2023 10:58 AM
game changer  గేమ్ ఛేంజర్ పై అది నమ్మకండి
Game Changer releasing in two parts గేమ్ ఛేంజర్ పై అది నమ్మకండి
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కలయికలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్యాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 మూవీతో పాటుగా గేమ్ ఛేంజర్ షూటింగ్ చెయ్యడంతో ఈ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. అందుకే శంకర్ రిలీజ్ తేదీ చెప్పకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. 

అయితే ఈ మద్యన రెండు భాగాల ట్రెండ్ నే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి ఫాలో అవుతున్నాడని, శంకర్ గేమ్ చెంజర్ ని కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తారంటూ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో బాహుబలి, పుష్ప, దేవర టైప్ లోనే చరణ్ కూడా గేమ్ చెంజర్  భాగాలతో వస్తాడని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ ఒక్క భాగమే అని, రెండు భాగాలు అనేది జస్ట్ గాసిప్ అని తేల్చేస్తున్నారు. 

అయితే ఇండియన్ 2 కి సీక్వెల్ ఇండియన్ 3 మాత్రం ఉంటుంది అని తెలుస్తోంది. మరి రామ్ చరణ్-కియారా అద్వానీ కాంబోలో శంకర్ ప్రస్తుతం ఎమోషనల్ సీన్స్ ని హైదరాబాద్ లోనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. 

Game Changer releasing in two parts :

Game Changer to be released in 2 parts

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ