Advertisement
TDP Ads

కాటసానికి ఝలక్.. బైరెడ్డికి లక్కీ ఛాన్స్

Fri 13th Oct 2023 07:33 AM
ys jagan  కాటసానికి ఝలక్.. బైరెడ్డికి లక్కీ ఛాన్స్
YS Jagan lucky chance for Byreddy.. కాటసానికి ఝలక్.. బైరెడ్డికి లక్కీ ఛాన్స్
Advertisement

ఏపీలో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విపరీతంగా కృషి చేస్తున్నారట. ఇప్పటికే ఆయనపై భూ కబ్జాలు, మైనింగ్ వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన గ్రాఫ్ తగ్గిందని టాక్. దీంతో కాటసానిని తప్పంచేసి ఆయన స్థానంలో శాప్ చైర్మన్ బైరెడ్డికి సీటు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ప్రస్తుతం కాటసాని తన తనయుడికి ఎలాగైనా సీటు ఇప్పించాలని నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు అసలు ఆయననే తప్పించాలనే యోచనలో అధిష్టానం ఉందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.

కాటసాని అప్పట్లో 1985 తర్వాత వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన కాటసాని.. 1985, 1989, 1994లో విజయం సాధించారు. ఆ తరువాత 1999లో ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మళ్లీ 2004, 2009లో కాటసాని హవా కొనసాగుతోంది. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కాటసాని గౌరు చరితా రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత భూ కబ్జాలు, మైనింగ్ వంటి వాటికి పాల్పడ్డారనే ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. అయితే ఈసారి ఆయన తన కుమారుడు కాటసాని శివ నరసింహా రెడ్డికి టికెట్ ఇప్పించాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారని టాక్.

అసలే ఎలాగైనా టికెట్ రేసు నుంచి కాటసానిని తప్పించాలని చూస్తున్న వైసీపీకి మంచి అవకాశం దక్కింది. దీంతో ఆయనను తప్పించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సీటు ఇవ్వాలనే యోచనలో వైసీపీ బాస్ ఉన్నారట. మరోవైపుప కాటసాని కానీ ఆయన కుమారుడు కానీ ఎవరు పాణ్యం బరిలో నిలిచినా కూడా ఎదుర్కొనేందుకు గౌరు చరిత సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాటసానిపై ఉన్న ఆరోపణలను అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి వైసీపీ నేతలకు చెక్ పెట్టేందుకు టీడీపీ చాలా యత్నిస్తోంది. ఈసారి మాత్రం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ హోరాహోరీగానే ఉండే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..కాటసానికి ఝలక్..బైరెడ్డికి లక్కీ ఛాన్స్!

ఏపీలో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విపరీతంగా కృషి చేస్తున్నారట. ఇప్పటికే ఆయనపై భూ కబ్జాలు, మైనింగ్ వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన గ్రాఫ్ తగ్గిందని టాక్. దీంతో కాటసానిని తప్పంచేసి ఆయన స్థానంలో శాప్ చైర్మన్ బైరెడ్డికి సీటు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ప్రస్తుతం కాటసాని తన తనయుడికి ఎలాగైనా సీటు ఇప్పించాలని నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు అసలు ఆయననే తప్పించాలనే యోచనలో అధిష్టానం ఉందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.

కాటసాని అప్పట్లో 1985 తర్వాత వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన కాటసాని.. 1985, 1989, 1994లో విజయం సాధించారు. ఆ తరువాత 1999లో ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మళ్లీ 2004, 2009లో కాటసాని హవా కొనసాగుతోంది. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కాటసాని గౌరు చరితా రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత భూ కబ్జాలు, మైనింగ్ వంటి వాటికి పాల్పడ్డారనే ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. అయితే ఈసారి ఆయన తన కుమారుడు కాటసాని శివ నరసింహా రెడ్డికి టికెట్ ఇప్పించాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారని టాక్.

అసలే ఎలాగైనా టికెట్ రేసు నుంచి కాటసానిని తప్పించాలని చూస్తున్న వైసీపీకి మంచి అవకాశం దక్కింది. దీంతో ఆయనను తప్పించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సీటు ఇవ్వాలనే యోచనలో వైసీపీ బాస్ ఉన్నారట. మరోవైపుప కాటసాని కానీ ఆయన కుమారుడు కానీ ఎవరు పాణ్యం బరిలో నిలిచినా కూడా ఎదుర్కొనేందుకు గౌరు చరిత సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాటసానిపై ఉన్న ఆరోపణలను అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి వైసీపీ నేతలకు చెక్ పెట్టేందుకు టీడీపీ చాలా యత్నిస్తోంది. ఈసారి మాత్రం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ హోరాహోరీగానే ఉండే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

YS Jagan lucky chance for Byreddy..:

Katasani Jhalak.. Lucky chance for Byreddy!

Tags:   YS JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement