తారక్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన స్టూడెంట్ 1నెంబర్ సినిమా తర్వాత నటుడు రాజీవ్ కనకాలతో స్నేహం చేసాడు. అప్పటినుంచి ఇప్పటివరకు రాజీవ్-తారక్ ల స్నేహం కొనసాగుతుంది. కొన్నాళ్ళు వీరిద్దరూ కలిసి సినిమాల్లో కనిపించినా ఈ మధ్య కాలంలో రాజివ్ కనకాలని తన సినిమాల్లో తీసుకోవడం లేదు ఎన్టీఆర్. అయితే ఇప్పటికి వీరి స్నేహం మాత్రం కంటిన్యూ అవుతుంది అనేలా రాజీవ్ కనకాల తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ చేస్తున్న సినిమా ప్రమోషన్స్ లో తారక్ పై చేసిన కామెంట్స్ తో స్పష్టతనివ్వాలనుకున్నాడు.
మరీ ముఖ్యంగా తారక్ ఈమధ్యన కొన్ని విషయాలపై స్పందించకపోవడంపై వస్తున్న విమర్శలకు తారక్ తరుపున ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఆర్.ఆర్.ఆర్ కోసం ఎన్టీఆర్ దాదాపుగా నాలుగేళ్లు ఖర్చు పెట్టాడు. నాలుగేళ్ల కాలంలో మూడు నాలుగు సినిమాలు చేయగలిగే అవకాశం పోగొట్టుకున్న తారక్ ఇప్పుడు చేస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం దేవర కోసం అంతే కష్టపడాల్సి రావడంతో.. ఎన్టీఆర్ వేరే విషయాలను గురించి పట్టించుకునే పరిస్థితిలో లేడు.
అందుకే ఎన్టీఆర్ వేరే విషయాల గురించి పట్టించుకోవడం లేదు అంటూ రాజీవ్ కనకాల తన వెర్షన్ వినిపించాడు. ఆ కారణాల వలనే ఎన్టీఆర్ ఏ విషయంపై ప్రత్యేకంగా స్పందించలేదు అంటూ రాజీవ్ కనకాల చెప్పింది లాజికల్ గా లేకపోయినా.. కొంతమంది అదే సరిపెట్టుకుంటున్నారు.