గత ఏడాది ఇదే సమయంలో సమంత తనకి మాయోసైటిస్ వ్యాధి ఉంది దాని వలన తాను ఇబ్బంది పడుతున్నాను, మాయోసైటిస్ అంటే నీరసం అంటూ ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించుకుంటున్న పిక్ ని పోస్ట్ చేసి అందరికి షాకిచ్చింది. యశోద మూవీ ప్రమోషన్స్ సమయంలో సమంత ఈ షాకింగ్ న్యూస్ ని వెల్లడించింది. ఆ తర్వాత ఆరు నెలల పాటు సమంత ఇంటికే పరిమితమైంది. ట్రీట్మెంట్ తీసుకుంటూ మానసికంగా విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ ఈ ఏడాది కాస్త కోలుకుని శాకుంతలం, ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసింది.
కానీ మరోసారి సమంత తన ఆరోగ్యం కోసం నటనకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాకి చేరువగా ఉండే సమంత రెండు రోజుల క్రితం దుబాయ్ లోని ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ లో సందడి చేసింది. ఇంతలోనే సమంత మళ్ళీ బెడ్ మీద ఉండి సెలైన్ ఎక్కించుకున్న పిక్ ని ఇన్స్టాలో పోస్ట్ చెయ్యడంతో ఆమె అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. అయితే సమంత తనకి కావాల్సిన ఇమ్యూనిటీ కోసమే ఈ సెలైన్ పెట్టించుకున్నట్లుగా తెలిపింది.
తాను పెట్టించుకున్న డ్రిప్ వలన తన శరీరానికి కావాల్సిన రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధకశక్తి పెరుగుదల, గుండె సంరక్షణ, కండరాల శక్తి, వైరస్ లకి వ్యతిరేకఖంగా పోరాడే శక్తి, గుండెకి రక్త సరఫరా, ఎముకల్లో ఉండే బలహీనత పోగొట్టేందుకు ఈ డ్రిప్పు ఉపయోగపడుతుంది అంటూ సమంత చెప్పుకొచ్చింది. దానితో ఆమె అభిమానులు కాస్త శాంతించారు. లేదంటే ఆమెకి మళ్ళీ ఏదో అయ్యింది ఆనుకుని కంగారు పడిపోయారు.