గుంటూరు కారం మూవీ ముచ్చట్లు మేకర్స్ కన్నా ఎక్కువగా జర్నలిస్ట్ లే చెబుతున్నారు. నిర్మాత నాగవంశీ గుంటూరు కారం షూటింగ్ అలాగే విడుదల తేదీపై రీసెంట్ ప్రెస్ మీట్స్ లో ధీమా వ్యక్తం చేసాడు. గుంటూరు కారం ఖచ్చితంగా సంక్రాంతికే అని ఫిక్సవ్వమన్నాడు.
ఫస్ట్ సింగిల్ పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం సాంగ్ రెడీగా ఉంది.. కానీ లిరికల్ వీడియో గురించి డిస్కషన్ నడుస్తుంది. ప్రస్తుతం మహేష్-త్రివిక్రమ్ ఇద్దరూ షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని దానిమీద ఫోకస్ పెట్టారు. నిర్మాత నాగ వంశీ, థమన్ సాంగ్ రిలీజ్ మీద ఫోకస్ పెట్టారు. అది ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనేది తర్హనభర్జనలు జరుగుతున్నాయి. అంటూ ఓ మీడియా మిత్రుడు ట్వీటేసాడు.
అది చూసి వెర్రెత్తిపోయి మహేష్ అభిమానులు దానిని వైరల్ చేసారు. అసలు గుంటూరు కారం అప్ డేట్స్ మేకర్స్ కాకుండా మీడియా వారు ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెప్పడం.. వాటిని మహేష్ అభిమానులు అదేపనిగా వైరల్ చెయ్యడం చూస్తున్నాము. మరి మేకర్స్ ఒక్కసారి ఆ గుంటూరు కారం అప్ డేట్ రివీల్ చేస్తే బావుంటుంది అనేది నెటిజెన్స్ అభిప్రాయం. లేదంటే అసలు విషయం పక్కకి పోయి అనవసర సోది బయటికి వస్తుంది.