బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న భగవంత్ కేసరి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో మొదలయ్యాయి. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించిన యూనిట్.. ఇప్పుడు ఛానల్స్ ఇంటర్వూస్, అన్ స్టాపబుల్ 3 లో హడావిడి చేస్తుంది. కాజల్ అగర్వాల్-శ్రీలీల ఇద్దరూ భగవంత్ కేసరి ప్రమోషన్స్‌లో చూడముచ్చటగా గ్లామర్‌గా కనబడుతున్నారు.
కాజల్ చాలా రోజుల తర్వాత మీడియా ముందు హంగామా చేస్తుంది. ఆమె కాస్త బరువు పెరిగినట్లుగా కనిపించినా.. శ్రీలీల మాత్రం సూపర్బ్ గ్లామర్‌తో అచ్చతెలుగు అమ్మాయిలా అదిరిపోయే లుక్స్‌తో కనిపిస్తుంది. చాలా యాక్టీవ్‌గా చురుగ్గా కనబడుతుంది. లంగావోణీ, చుడీదార్స్, శారీస్ అబ్బో అన్ని రకాల అవుట్ ఫిట్స్‌లో శ్రీలీల భగవంత్ కేసరి ప్రమోషన్స్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
భగవంత్ కేసరిలో సింపుల్‌గా ఆర్మీకి రెడీ అయ్యే అమ్మాయిగా కనిపించిన శ్రీలీల ప్రమోషన్స్‌లో మాత్రం తన మార్క్ చూపిస్తుంది. అందరి చూపు తన వైపే ఉండేలా రెడీ అవుతుంది. శ్రీలీల బ్యూటీ ఫుల్ లుక్స్‌తో తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. స్కంద ప్రమోషన్స్ ముగిసిన వారంలోపే భగవంత్ కేసరి ప్రమోషన్స్‌లో వాలిపోయిన శ్రీలీల అది పూర్తయిన వారానికే ఆదికేశవ ప్రమోషన్స్ షురూ చెయ్యాల్సి ఉంది. ఆ చిత్రం నవంబర్ 10న విడుదల కాబోతుంది.