Advertisementt

చైతూ-సామ్.. అవన్నీ రూమర్సే..

Sun 22nd Oct 2023 05:49 PM
naga chaitanya,samantha  చైతూ-సామ్.. అవన్నీ రూమర్సే..
Again Rumours on Naga Chaitanya and Samantha చైతూ-సామ్.. అవన్నీ రూమర్సే..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-సమంతలు మూడేళ్ళ క్రితం విడిపోయి విడాకులు తీసుకుని వేరు వేరుగా ఉంటున్నారు. విడాకులు తర్వాత నాగ చైతన్య కూల్‌గా తన పని తాను చేసుకుంటుంటే.. సమంత మాత్రం బాధ మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా చూపించింది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమంత.. తన సినిమాలు తాను చేసుకుంటుంది. కానీ వారు విడిపోవడం అభిమానులకే కాదు చాలామందికి ఇష్టం లేదు. 

అయితే విడాకుల తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీగా కనిపిస్తున్న సమయంలో నాగ చైతన్య-సమంత మరోసారి కలవబోతున్నారనే వార్త అక్కినేని అభిమానులకి సంతోషాన్నిస్తుంది. నాగ చైతన్య, సమంతకి ఇష్టమైన పెంపుడు పెట్ యాష్‌తో కనిపించడమే వీరి ప్యాచప్‌కి కారణమంటూ కథనాలు వస్తున్నాయి. చైతు తరచూ సమంతతో కలుస్తున్నాడు అని చెప్పడానికే సమంత పెంపుడు డాగ్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది.

అయితే చైతు సమంత కలవడం అనేది జస్ట్ రూమర్ అంటూ మరికొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే సమంత తన నడుము మీదున్న చై టాటూ‌ని చెరిపేసి మరీ ఫొటోలకి ఫోజులిచ్చింది.. అంటూ ఆమె దుబాయ్‌లో ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ అప్పుడు ఇచ్చిన ఫోటో షూట్ ఫొటోస్ షేర్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. 

అసలు చైతు-సమంత కలిస్తే అందరికి సంతోషమే. కానీ అది ఇంతగా ప్రచారం జరిగాక రూమర్ అంటే మళ్ళీ మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అంతే.

Again Rumours on Naga Chaitanya and Samantha:

Real News about Naga Chaitanya and Samantha ReUnion

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ