Advertisementt

సలార్ ట్రైలర్ కోసం నిరీక్షించాల్సిందే

Wed 11th Oct 2023 07:52 PM
prabhas  సలార్ ట్రైలర్ కోసం నిరీక్షించాల్సిందే
We have to wait for the trailer of Salaar సలార్ ట్రైలర్ కోసం నిరీక్షించాల్సిందే
Advertisement
Ads by CJ

డిసెంబర్ 22 న సలార్ సినిమా ప్యాన్ ఇండియా రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసిన మేకర్స్ ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ప్రభాస్ అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అయితే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అక్టోబర్ 23 నుంచే అంట. అంటే ప్రభాస్ బర్త్ డే రోజు నుంచి రెండు నెలల పాటు సలార్ ప్రమోషన్స్ తో ప్యాన్ ఇండియాని చుట్టేయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. 

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ గా సలార్ ట్రైలర్ ని వదిలి.. ఆ ట్రైలర్ తోనే ప్రతి భాషలో సలార్ ప్రెస్ మీట్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారట. మరి ప్రభాస్ ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కైనా, లేదంటే ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా హాజరవుతాడేమో.. మిగతా ప్రమోషన్స్ మొత్తం ప్రశాంత్ నీల్ వాళ్ళే చూసుకోవాలి. 

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ కి కుదిరినట్టుగా సలార్ కి కుదురుతుందా.. ప్రభాస్ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తా అంటే ప్రశాంత్ నీల్ వదులుతాడా.. పెద్ద సినిమా.. ప్రమోషన్స్ ఉంటేనే బడ్జెట్ వర్కౌట్ అవుతుంది.. ఈసారి ప్రభాస్ తప్పించుకోవడానికి లేదు అంటున్నారు. చూద్దాం ప్రభాస్ ఏం చేస్తాడో అనేది. 

We have to wait for the trailer of Salaar:

Buzz: Salaar Trailer Not Coming On Prabhas Birthday

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ