KGF తో కన్నడ నుంచి ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి దూసుకొచ్చిన స్టార్ హీరో యష్. KGF పార్ట్ 1 అండ్ 2 తో ప్యాన్ ఇండియా మార్కెట్ లో బలమైన ముద్ర వేసిన యష్ కి కన్నడ లోనే కాదు.. చాలా భాషల్లో అభిమాన గణం ఏర్పడింది. మాస్ ఆడియన్స్ ని తన వైపు తిప్పకున్న యష్ ని ఎవరైనా చులకన చేస్తే ఊరుకుంటారా.. అస్సలూరుకోరు. ఇప్పుడు టైగర్ హీరో రవితేజ అదే పొరబాటు చేశాడు. పొరబాటు అనలేము కానీ.. ఇదో విధంగా యాష్ అభిమానులని హార్ట్ చేసింది.
రవితేజని టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్లో భాగంగా ముంబై మీడియా ఓ ఇంటర్వ్యూలో హీరోల గురించి అడగగా.. రామ్ చరణ్, ప్రభాస్ గురించి మాట్లాడిన రవితేజ.. యష్ గురించి మాత్రం డిఫరెంట్ గా సమాదానమిచ్చాడు. KGF దొరకడం యష్ అదృష్టమని, కానీ యష్ పాత సినిమాలేవీ చూడలేదని చెప్పాడు. అదే యష్ అండ్ కన్నడ ఫ్యాన్స్ ని బాధ పెట్టిందట.
ప్యాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న తమ హీరో కేవలం లక్కు మీద హిట్టు కొట్టాడని రవితేజ అంటాడా అంటూ రవితేజపై నెగిటివిటి చూపిస్తూ కన్నడీగులు ట్వీట్ల పర్వం మొదలుపెట్టారు. మరి రవితేజ అన్నదానిలో ఇసుమంతైనా తప్పులేకపోయినా.. అభిమానులు మాత్రం చిన్న చిన్న విషయాలనే పట్టుకుని ఇలా రాద్ధాంతం చేస్తూ ఉంటారు.