నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ని హీరోగా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారా అని నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రిపై రకరకాల ఉహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్య తానే ఆదిత్య 369 కి సీక్వెల్ చేస్తాను, ఆ సినిమాతోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని చెబుతున్నారు.మధ్యలో పూరి జగన్నాథ్, అలాగే బాలయ్య తో సినిమాలు చేసే దర్శకుల పేర్లు మోక్షజ్ఞ ఎంట్రీ దర్శకుల లిస్ట్ లో కనబడుతున్నాయి.
తాజాగా మోక్షజ్ఞ భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీలీల నేను హీరో-హీరోయిన్స్ గా నటిస్తాను అంటే నా కొడుకు మోక్షజ్ఞ నేను యంగ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను, మీగ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడ్ అన్నాడు అంటూ బాలయ్యే కొడుకు గురించి రివీల్ చేసిన రెండోరోజే.. శ్రీలీల పక్కన నిలబడి మోక్షజ్ఞ కనిపించాడు. థమన్ మ్యూజిక్ దగ్గరకి బాలయ్య, అనిల్ రావిపూడి, శ్రీలీల, మోక్షజ్ఞ వెళ్లారు. దానికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ పిక్ చూడగానే అందులో శ్రీలీల-మోక్షజ్ఞలు పక్కపక్కనే ఉండడంతో.. మోక్షజ్ఞ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో కానీ.. శ్రీలీల తో మాత్రం ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటాడు. డెఫనెట్ గా మోక్షజ్ఞ ఫస్ట్ హీరోయిన్ శ్రీలీలే అంటూ నందమూరి అభిమానులు ఫిక్సయిపోతున్నారు.