అక్టోబర్ 20 న ప్యాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరావు మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై ఈరోజు ఐటీ దాడులు జరగడం కలకలం సృష్టించింది. ఫిలిం నగర్ లోని అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై ఐటి అధికారులు ఆకస్మిక దాడులు టాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న సమయంలో ఇలాంటి దాడులు కాస్త ఇబ్బంది పెట్టేవే.
అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరావు కి సంబంధించిన బిజినెస్ లెక్కలు సరిగ్గా చెప్పారా.. అలాగే జీఎస్టీ సక్రమంగా కడుతున్నారా అన్న విషయాలపై ఐటి అధికారులు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.
రవితేజ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరావు మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ ముంబై లో సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో ప్యాన్ ఇండియా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు పై అంచనాలు భారీగా ఉన్నాయి.
దసరా సందర్భంగా విడుదల కాబోతున్న ఈ చిత్ర నిర్మాతపై ఐటి దాడులు జరగడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే కొన్నాళ్లుగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు ఇలా ఆయా నిర్మాతలపై ఐటి దాడులు జరగడమనేది చాలా క్యాజువల్ గా మారిపోయింది. అందులో భాగమే ఈ టైగర్ నిర్మాతపై ఐటి దాడులు కూడా.