యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో రెండో మూవీగా వస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టుగా రీసెంట్ గానే కొరటాల శివ అనౌన్స్ చేసారు. అయితే కొరటాల శివ నే కి దేవర కథ, కథనం చెప్పిన దానికంటే మిన్నగా తెరమీదకు దాన్ని తీసుకు వస్తున్నారు అని తెలుస్తోంది. దేవర రెండు భాగాలు ఒకదాన్ని మించి మరొకటి జనాల్ని అలరిస్తుందని దేవర టీమ్ బలంగా నమ్ముతోంది.. అంటూ సోషల్ మీడియాలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసారు.
మరి ఇప్పటికే దేవర పై ఉన్న అంచనాలు ఇలాంటి ట్వీట్స్ తో మరింతగా పెరిగిపోతాయి. నిన్న మంగళవారం దేవర సెట్స్ లో నిర్మాత మిక్కిలినేని బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. కొరటాల, విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్.. ఇంకా టీం మెంబెర్స్ ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. దేవర లో యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అంటున్నారు. ఏ సన్నివేశాన్ని ఎడిటింగ్ పేరుతొ తీసెయ్యలేము.. అంత బాగా సీన్స్ వస్తున్నాయని.. అందుకే దేవరని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టుగా కొరటాల హైప్ క్రియేట్ చేసారు.