బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ హౌస్ లో ముందుగా హౌస్ మేట్ గా మారి ఆ తర్వాత శివాజీ త్యాగంతో మొదటి కెప్టెన్ గా అవతరించాడు. శివాజీ తన భార్య రాసిన లెటర్ త్యాగం చెయ్యడం, రంగుపడుద్ది టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి సీజన్ 7 కి మొదటి కెప్టెన్ అయ్యాడు. అయితే పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీని హౌస్ మేట్స్ చాలామంది ఒప్పుకోవడం లేదు. ఫలితంగా అతను తన కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది.
బిగ్ బాస్ కెప్టెన్ అంటే ఎలా ఉండాలి అని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని అడగ్గానే శోభా శెట్టి.. కెప్టెన్ అంటే హౌస్ మేట్స్ ని తన కంట్రోల్ లో పెట్టుకుని పని చేయించుకోవాలి అంది, అమరదీప్ కూడా కెప్టెన్ అంటే అందరితో పనులు చేయించుకోవాలి అన్నాడు, సందీప్ మాస్టర్, అలాగే కొత్తగా వచ్చిన పూజ ఇలా అందరూ పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ గురించి మట్లాడారు.
అప్పుడు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ మీ దృష్టిలో కెప్టెన్ అంటే ఎలా ఉండాలి అని అడిగితే.. తాను పని చేస్తూ అందరితో పని చేయించుకునేవాడే కెప్టెన్ అన్నాడు. కానీ ఇక్కడ తన మాట ఎవరు వినడం లేదు, వీడు చెబితే పని చేసేదేమిటి అని చూస్తున్నారు అన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అని ఎంతమంది అభిప్రాయపడుతున్నారు అని అడగ్గానే హౌస్ లో ఉన్నవాళ్ళంతా చెయ్యి ఎత్తారు. అమరదీప్ తప్ప. దానితో అతని కెప్టెన్సీ బ్యాండ్ వెనక్కి ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు.