సూపర్ స్టార్ మహేష్ బాబు-తివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీపై క్రేజ్ మాములుగా లేదు. గుంటూరు కారం ఫస్ట్ లుక్ లోనే మహేష్ ఎలాంటి కేరెక్టర్ చేస్తున్నాడో అనేది త్రివిక్రమ్ రివీల్ చేసేసారు. పవర్ ఫుల్ మాస్ కేరెక్టర్ లో మహేష్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని వదిలేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారనే న్యూస్ తో మహేష్ అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
అయితే తాజాగా గుంటూరు కారం మూవీ స్టోరీ లైన్ పై ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. గుంటూరు నగరంలో, మిర్చి యార్డ్ లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బయటపెట్టేందుకు పనిచేస్తున్న ఓ లేడీ జర్నలిస్టుతో అదే నగరానికి చెందిన ఓ యువకుడు ప్రేమలో పడడం, ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ కోసం విలన్స్ కి ఎదురుతిరగడం, అసాంఘిక కార్యకలాపాల్ని అడ్డుకుని హీరోగా మారడం వంటి అంశాలతో గుంటూరు కారం ఉండబోతుందట.
మరి ఇది రివెంజ్ డ్రామానే అయినా త్రివిక్రమ్ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట. శ్రీలీల-మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు మెయిన్ స్టైలిష్ విలన్ గా నటించబోతున్నారు. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.