కస్టడీ డిసాస్టర్ తర్వాత నాగ చైతన్య హిట్ డైరెక్టర్ చందు మొండేటితో జట్టు కట్టాడు. గీత ఆర్ట్స్ లో నాగ చైతన్య-చందు మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. జాలరి వారి పేటలో సాగే కథ కావడంతో శ్రీకాకుళం, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో లొకేషన్స్ వెతికి వచ్చారు. నాగ చైతన్య ఈ చిత్రం కోసం లుక్ మార్చేసి చాలా అంటే చాలా స్టైలిష్ మాస్ లుక్ లోకి వచ్చేసాడు.
చందు మొండేటి తో నాగ చైతన్య చిత్రం వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య మరోసారి శివ నిర్వాణతో మూవీ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేకుంటున్నట్లుగా తెలుస్తోంది. మజిలీ తో హిట్ కొట్టిన చైతూ-శివ నిర్వాణ మరోసారి జట్టు కడతారని టాక్ వినిపిస్తోంది.
నాగ చైతన్య కొన్ని కథలు విన్నప్పటికీ.. ఇప్పటివరకు తాను ఏది లాక్ చేసుకోవట్లేదట. ప్రస్తుతం చందు మొండేటి ప్రాజెక్ట్ తో పాటుగా శివ నిర్వాణం ప్రాజెక్ట్స్ మీదే చైతూ పూర్తి దృష్టి ఉందంటున్నారు. శివ రీసెంట్ గానే ఖుషి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తదుపరి మూవీచైతు తో లాక్ చేసుకుంటున్నట్లుగా సమాచారం.