బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన భగవంత్ కేసరి విడుదలకు కేవలం 8 రోజులు మాత్రమే ఉంది. ఈనెల 19న దసరా స్పెషల్ గా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే ట్రైలర్ లాంచ్ వేడుకతో అభిమానులకి ఫుల్ ట్రీట్ ఇచ్చారు. కాకపోతే భగవంత్ కేసరి ట్రైలర్ లో కథ అర్ధం కాక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.
అసలు శ్రీలీలకి భగవంత్ కేసరి యుద్ధ శిక్షణ ఎందుకు ఇప్పిస్తున్నాడు, ఆర్మికి పంపించాలనే ఆ తపన ఎందుకు అనేది తెలియక గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా భగవంత్ కేసరిపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. భగవంత్ కేసరిలో కనిపించని చాలా విషయాలు సినిమాలో ఉన్నాయట. అందులో అతి ముఖ్యమైనది బాలకృష్ణ రెండో గెటప్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అని అంటున్నారు.
మరి వీటన్నిటిని సినిమాలో చూపించడానికి ట్రైలర్ లో రివీల్ చెయ్యకుండా అనిల్ రావిపూడి తెలివిగా సస్పెన్స్ లో పెట్టేసాడు. కొన్ని కొన్ని విషయాలు, సీక్రెట్స్ భగవంత్ కేసరి ఇంటర్వ్యూలో బయటికొస్తున్నాయి. ప్రస్తుతం కాజల్, శ్రీలీల వీళ్లంతా ఛానల్ ఇంటర్వ్యూలో హడావిడి మొదలు పెట్టేసారు.