కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కిన లియో మూవీ ప్యాన్ ఇండియా మార్కెట్ లో అక్టోబర్ 19 న విడుదలవుతుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ లియో ప్రమోషన్స్ లో బిజీగా వున్న సమయంలో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లియో లో క్యామియో చేసారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఓ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.
అసలు అదే నిజమని, రామ్ చరణ్ ని దర్శకుడు లోకేష్ సంప్రదించగానే చరణ్ విజయ్ లియో మూవీలో నటించడానికి ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రకారం షురూ అయ్యింది. కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ లియో లో క్యామియా రోల్ లో కనిపించబోతున్నారనేది వాస్తవం కాదని, అందులో ఎలాంటి నిజం లేదు అని.. ఇది కేవలం తెలుగులో లియో పై క్రేజ్ సంపాదించడానికి ఈ గాసిప్ పుట్టించారంటున్నారు.
రామ్ చరణ్-లోకేష్ కనగరాజ్ ల కలయికలో మూవీపై బలమైన వార్తలు వినిపించడంతో.. చరణ్ లియో లో గెస్ట్ రోల్ లో కనిపిస్తాడనగానే అందరూ నమ్మేసారు. కానీ రామ్ చరన్ లియో లో నటించడం అనేది జస్ట్ రూమర్ అని కొట్టిపారేస్తున్నారు.