మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో సంక్రాంతికి టార్గెట్ గా తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పై ఎప్పటికప్పుడు న్యూస్ లు రావడము, మహేష్ అభిమానులు డిస్పాయింట్ అవడము చూస్తున్నాము. సంక్రాంతికి విడుదల కాబోతున్న గుంటూరు కారం షూటింగ్ బాబు-త్రివిక్రమ్ లు చకచకా చుట్టేస్తున్నారు.
అయితే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ సర్ ప్రైజ్ దసరా కన్నా ముందే రాబోతుంది అని నిర్మాత నాగ వంశి మ్యాడ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. మరో వారం రోజుల్లో దసరా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. కానీ టీం నుంచి ఫస్ట్ సింగిల్ పై ఎలాంటి అప్ డేట్ రావడం లేదు, థమన్ అదే పనిలో ఉన్నాడు.. మ్యూజిక్ రెడీ కానీ సాంగ్ చిత్రీకరణ అవ్వలేదు.. త్వరలోనే ఆ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసి వదులుతారు అంటున్నారు.
మరి గుంటూరు కారం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా అప్ డేట్స్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. మహేష్ అభిమానులు మాత్రం గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై గంపెడు అసలు పెట్టుకున్నారు. ఈసారి కూడా రాకపోతే మాత్రం విషయం మాములుగా ఉండదు. అభిమానుల చేతిలో మేకర్స్ కి ఇత్తడే అంటున్నారు.