ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ చెంసేందుకు బోలెడంతమంది దర్శకనిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అందులో ఎవరికి ఆ లక్కు వస్తుందో అనేది చెప్పడం కష్టంగానే ఉంది. అంతమంది లైన్ లో ఉన్నారు. సలార్ పార్ట్ 1 ని విడుదలకు సిద్ధం చేస్తున్న ప్రభాస్ ఆతర్వాత కల్కి మూవీతో ఆరు నెలలు తిరిగేలోపు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాడు. ఆ తరవాత మారుతి మూవీ ఉంటుంది.
ఆ నెక్స్ట్ స్పిరిట్ తో సందీప్ వంగ లైన్ లోకి వస్తాడు. ఇంతలోపులో సీతారామం తో బ్యూటిఫుల్ హిట్ కొట్టిన హను రాఘవపూడి ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తున్నాడు.. ప్రభాస్-హను కాంబోలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది అనే టాక్ ఉంది. హను రాఘవపూడి-ప్రభాస్ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది.
హను రాఘవపూడి కూడా ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిల్ ఉంచుకుని ప్యాన్ ఇండియా కథనే రెడీ చేస్తున్నాడట, త్వరలోనే కథ లాక్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టి హీరోయిన్ ని ఫైనల్ చేస్తారని అంటున్నారు. మరి ఈ న్యూస్ నిజంగా ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ కదా..!