దసరా ఫెస్టివల్ కి పోటీ పడబోతున్న సినిమాల్లో ఇప్పుడు అందరి చూపు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు మీదే ఉంది. 19 న తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి విడుదలకాబోతుంది. తమిళంలో విజయ్-లోకేష్ కనగరాజ్ ల లియో కూడా అదే 19 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ విషయంలో అభిమానులు కాస్త అసంతృప్తిలో ఉన్నారు.
విజయ్ లియో ట్రైలర్ పై డిస్పాయింటెడ్ హాష్ టాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి మూవీని ఎలా హ్యాండిల్ చేసాడో.. ట్రైలర్ లో కథ రివీల్ అవలేదు అంటూ అభిమానులు కాస్త ఆందోళన పడ్డారు. ఇక ప్యాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 20 న విడుదలకాబోతున్న టైగర్ నాగేశ్వరావు పై ఇప్పుడు అందరి చూపు ఉంది. రవితేజ కూడా సినిమా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నాడు.
ముంబై ప్రమోషన్స్ మాత్రమే కాదు.. టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ తో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుని ప్రమోషన్స్ తో పరుగులు పెడుతున్నాడు రవితేజ. ఎయిర్ పోర్ట్ లోను, ఈవెంట్స్ లోను, ఇంటర్వూస్ లోను, పబ్లిక్ లోను ఇలా ఎక్కడ చూసినా రవితేజనే కనిపిస్తున్నాడు. దసరా ఫెస్టివల్ హీరో రవితేజని అన్నట్టుగా ఉంది వ్యవహారం. అటు విజయ్ ప్రమోషన్స్ కి రాడు, బాలయ్య కనిపించినా.. రెండు రాష్ట్రాలకే పరిమితం.
అందుకే రవితేజ తనదైన స్పీడుతో టైగర్ నాగేశ్వరావు ని ప్రమోట్ చేస్తూ ఫస్ట్ ప్యాన్ ఇండియా హిట్ కొట్టాలని కసితో కనిపిస్తున్నాడు.