నయనతార-విగ్నేష్ శివన్ లు అటు కేరీర్ తో పాటుగా ఇటు కొడుకులతో ముద్దుముచ్చట్లతో ఎంజాయ్ చేస్తున్నారు. విగ్నేష్ శివన్ చాలా గ్యాప్ తర్వాత లవ్ టుడే హీరోతో కొత్త సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. మరోపక్క నయనతార జవాన్ బ్లాక్ బస్టర్ తో ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా మారింది. అలాగే కొడుకుల పుట్టిన రోజు వేడుకలు, భర్త విగ్నేష్ శివన్ పుట్టిన రోజు వేడుకలంటూ బాగా బిజీగా కనబడుతుంది.
ఈమధ్యన ట్విన్స్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ అభిమానులకి ఫుల్ ట్రీట్ ఇస్తున్న నయనతార తాజాగా భర్త విగ్నేష్ తో కలిసి విహార యాత్రలో ఎంజాయ్ చేస్తూ విగ్నేష్ తో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది. రొమాంటిక్ గానే కాదు క్యూట్ గా స్వీట్ గా నయనతార-విగ్నేష్ శివన్ లు కనిపించారు. అయితే నయన్-విగ్నేష్ లు విదేశాలలో ఉన్నారా.. లేదంటే చెన్నైలోనే ఉన్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు.
జస్ట్ వారు పోస్ట్ చేసిన పిక్స్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం నయనతార ఫ్యామిలీ లైఫ్ ని, ఇటు కెరీర్ ని సమాంతరంగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అయితే మాత్రం అర్ధమవుతుంది.