బిగ్ బాస్ సీజన్ 7 లోకి మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ గౌతమ్ కృష్ణ బాడీ బిల్డింగ్ తోనూ, అరుపులతో బాగా హైలెట్ అయ్యాడు. ఫిజిక్ బాగానే ఉన్నా.. గౌతమ్ యాంగ్రిగా కనిపించాడు. ఈ వారం శుభశ్రీ ని డైరెక్ట్ ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణని సీక్రెట్ రూమ్ లో ఉంచారు. ఇక సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన గౌతమ్ శివాజీ, అమర్, శోభ ఇలా వీళ్లందరిపై సంచలనంగా మాట్లాడుతున్నాడు. పెద్దాయన ముసుగులో శివాజీ అంటూ, అమరదీప్ వెన్నుపోటు అంటూ మాట్లాడుకుంటున్నాడు.
నిన్న రాత్రి సోమవారం ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ సమయం ముగిసినది అని చెప్పగానే.. గౌతమ్ పులిలా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇవ్వడం ఇవ్వడమే రాననుకున్నారా.. రాలేననుకున్నారా అంటూ హౌస్ మేట్స్ కి షాకిచ్చాడు. తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా. అయినా ఈ అశ్వద్దమ చావడు.. శివన్నా గౌతమ్ అయితే ఎంటర్టైన్ చెయ్యలేడు అన్నారు. ఎంటర్టైన్ అంటే ప్యాంటు చొక్కా వేసుకుని తిరగడం కాదు కదా అంటూ శివాజితో గొడవ పెట్టుకున్నాడు.
ప్రస్తుతం #GouthamKrishna #BiggBossTelugu7 హాష్ టాగ్స్ తో గౌతమ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాడు. తనని వెన్నుపోటు పొడిచినోళ్ళని వదలను అంటూ గౌతమ్ కాస్త అగ్రెస్సివ్ గానే కనిపించాడు. ఇకపై యుద్ధమే అన్నట్టుగా గౌతమ్ హౌస్ లోకి ఇచ్చిన ఎంట్రీ చూసి హౌస్ మేట్స్ కూడా కంగారు పడిన ప్రోమో వైరల్ గా మారింది.