హీరో నవదీప్ ని ఈడీ వదలడం లేదు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో గత నెల 23 న నవదీప్ ని విచారించిన నార్కోటిక్ పోలీసులు నేడు మరోసారి నవదీప్ ని విచాణకు పిలిచారు. బెంగుళూరులో డ్రగ్స్ తో నైజీరియన్స్ పోలీసులుకు పట్టుబడడంతో ఆ కేసులోనూ నవదీప్ ని టార్గెట్ చేసింది ఈడీ.
ముగ్గురు నైజీరియన్ల తో హీరో నవదీప్ కు పరిచయాలు. ఈరోజు విచారణలో వీరితో జరిపిన లావాదేవీల పై వివరాలు ఆరా తీయనున్న ఈడి
ఈ విచారణ కోసం మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను కోరిన ఈడి.డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడి దర్యాప్తు.
నవదీప్ ఎకౌంట్లో తో పాటు నైజీరియన్లతో ఉన్న పరిచయాలపై ఈ విచారణలో కూపీ లాగనున్న ఈడి..