రీసెంట్ గానే హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఆంటోని సూసైడ్ చేసుకుని తనువు చాలించింది. మీరా మరణంతో విజయ్ ఆంటోని ఆయన భార్య ఫాతిమా మూగబోయారు. విజయ్ ఆంటోని కుమర్తెని తలుచుకోని క్షణం లేదు. తన కూతురు మీరాతో పాటుగా తానూ చనిపోయానంటూ విజయ్ ఆంటోని ఎమోషనల్ అవుతూ ఓ లేఖని విడుదల చేసాడు. తన కుమార్తె మరణంతో తాను చనిపోయాను అని, తన కూతురితో తాను మాట్లాడుతున్నాను అంటూ ఎమోషన అయిన విజయ్ ఆంటోని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చిన్న కుమార్తెని తనతోనే తీసుకెళుతున్నాడు.
ఇక విజయ్ ఆంటోని వైఫ్ ఫాతిమా కూడా సినిమా నిర్మాణంలో బిజీ అయ్యారు. విజయ్ హీరోగా మిగతా కార్యకలాపా బిజీ ఉంటూ ఉండగా.. ఆయన భార్య ఫాతిమా సినిమా నిర్మాణ పనులు చూసుకుంటూ బిజీ అయ్యారు. తాజాగా ఆమె తన ట్విట్టర్ లో పెద్ద కుమర్తె మీరాని తలుచుకుని ఎమోషనల్ గా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. నువ్వు 16 ఏళ్ళు మాత్రమే జీవిస్తావని తెలిస్తే.. నిన్ను నాకు మరింత దగ్గరగా ఉంచుకునేదాన్ని.
కనీసం సూర్యచంద్రులకి చూపించకుండా దాచుకునేదాన్ని. నువ్వు మా మధ్యన లేకపోవడం, నువ్వు మా ఆలోచనలు దాటి పోలేకపోవడంతో నేను రోజు చచ్చిపోతున్నాను, నువ్వు లేకుండా జీవించడం భారంగా మారింది.. ఈ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చేయ్.. నీ కోసం నీ చెల్లి ఎదురు చూస్తూనే ఉంది.. లవ్ యు తంగం అంటూ విజయ్ ఆంటోని వైఫ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.