Advertisementt

ప్రీ పోన్ చేసుకున్న నితిన్

Mon 09th Oct 2023 03:38 PM
nithin extra  ప్రీ పోన్ చేసుకున్న నితిన్
EXTRA - Ordinary Man releasing worldwide on December 8th ప్రీ పోన్ చేసుకున్న నితిన్
Advertisement
Ads by CJ

వక్కంతం వంశి దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌.. మూవీని డిసెంబర్ 23 రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని నితిన్ ప్రీ పోన్ చేసుకున్నాడు. డిసెంబర్ 22 న డైనోసార్ ప్రభాస్ సలార్ రావడంతో నితిన్ డిసెంబర్ 23 నుంచి తప్పుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. 

వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 8న నితిన్-శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌ సినిమాను భారీ ఎత్తున్న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ తో పెట్టుకోవడం ఎందుకు అని చాలామంది హీరోలు తమ సినిమాల డేట్స్ ని మార్చుకోగా నితిన్ మాత్రం అనుకున్న తేదీకన్నా ముందుగానే వచ్చేస్తున్నాడు. 

డేంజర్ పిల్లా.. సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే నితిన్ లుక్స్‌కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారు. క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.

EXTRA - Ordinary Man releasing worldwide on December 8th:

Nithin EXTRA - Ordinary Man releasing on December 8th

Tags:   NITHIN EXTRA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ