Advertisement

లోకేష్‌లో ఈ రేంజ్ మార్పా?

Mon 09th Oct 2023 07:31 AM
nara lokesh  లోకేష్‌లో ఈ రేంజ్ మార్పా?
Has this range changed in Lokesh? లోకేష్‌లో ఈ రేంజ్ మార్పా?
Advertisement

పుట్టగానే పరిమళించడానికి మనుషులేం పువ్వులు కాదు. పరిస్థితులు, ఏదైనా రంగంలో ఎక్స్‌పీరియన్స్ అనేది మనిషిని రాటు దేలేలా చేస్తుంది. దీనికి రాజకీయాలేం అతీతం కాదు. ఎక్కడో యూఎస్‌లో చదువుకుని వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో అడుగు పెట్టీ పెట్టగానే దుమ్ము రేపాలంటే ఎలా? కాస్త టైమ్ పడుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకోష్ విషయంలోనూ ఇదే జరిగింది. రాజకీయాల్లో వచ్చీ రాగానే ఆయనపై విమర్శలతో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు.

రాజకీయం తెలియదు.. మాట్లాడటం రాదు.. పప్పు.. అని మాత్రమే కాకుండా బాడీ షేమింగ్ కూడా చేశారు. అలాంటా నారా లోకేష్ చంద్రబాబు అరెస్ట్ నుంచి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వైసీపీ నేతలకే ఆశ్చర్యం వేస్తోంది. రోజురోజుకూ రాటు దేలుతున్నారు. చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలుగా యత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్.. ఏపీలో నేతలు, లోకల్ క్యాడర్‌ను కో ఆర్డినేట్ చేస్తూనే ఢిల్లీలోని న్యాయకోవిదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొడుకుగా తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తీసుకెళ్లారు.  

నిజానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్‌ వైఖరితో ఏపీ ప్రజానీకం అంతా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది. పారిపోయాడంటే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న వైసీపీకి తాను ఎక్కడ ఉన్నాను? ఎక్కడెక్కడ ఉంటున్నాను? అనేది అడ్రస్‌లతో సహా చెప్పి నోరు మూయించేశారు.అంతేకాదు.. తనకు నోటీసులు ఇచ్చేందుకు హస్తినకు వచ్చిన సీఐడీ అధికారులతో లోకేష్ వ్యవహారశైలి అద్భుతం. చాలా డీసెంట్‌గా వ్యవహరించారు. విచారణకు పక్కా హాజరవుతానని చెప్పారు. అంతేనా? చంద్రబాబుతో ములాఖత్ అనంతరం అధికారపక్షానికి సపోర్టివ్‌గా ఉన్న మీడియాను ఏకిపారేశారు.పంచులతో ఆకట్టుకున్నారు. మొత్తానికి నారా లోకేష్‌లో వచ్చిన మార్పు అధికార పక్షానికి అయితే మింగుడు పడటం లేదు. మరీ ఈ రేంజ్ ‌మార్పును భరించడం కష్టమే.

Has this range changed in Lokesh?:

Nara Lokesh delhi tour

Tags:   NARA LOKESH
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement