నందమూరి నటసింహ బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన భగవంత్ కేసరి విడుదలకు సమయం దగ్గరపడింది. మరో పది రోజుల్లో అంటే అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వేడుకని హన్మకొండలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకి బాలయ్య-కాజల్-శ్రీలీల హాజరవ్వగా.. కొద్దిసేపటి క్రితమే భగవంత్ కేసరి నుంచి ట్రైలర్ విడుదల చేసారు.
కూతురికి ఆర్మీ శిక్షణ ఇప్పిస్తూ ఆమెని ఆర్మీ కి పంపించాలనే తండ్రి తపనని, కోరిక ఈ ట్రైలర్ లో హైలెట్ చేసారు. బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్స్, విలన్ అర్జున్ రామ్ పాల్ తో తలపడే సన్నివేశాలు, కాజల్ అగర్వాల్ లుక్స్, శ్రీలీల యుద్దానికి సిద్ధమయ్యే సన్నివేశాలు, థమన్ మ్యూజిక్ అన్ని భగవంత్ కేసరి ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. బాలకృష్ణ-శ్రీలీల మధ్యన వచ్చే సీన్స్, బాలయ్య డైలాగ్స్ అన్ని ఫాన్స్ తో విజిల్స్ వేయించడం పక్కా.
కానీ ఎక్కడా కథ రివీల్ అవ్వకుండా దర్శకుడు అనిల్ చాలా జాగ్రత్త పడ్డాడు. ఇక బాలయ్య ట్రైలర్ లో చివరిగా బ్రో ఐ డోంట్ కేర్ అంటూ చెప్పిన డైలాగ్ కి నందమూరి అభిమానులకి పూనకలొచ్చేస్తున్నాయి. ఈ పండగ విన్నర్ మేమె అంటూ డిసైడ్ అవుతున్నారు వాళ్ళు.