బిగ్ బాస్ సీజన్ 7 లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. అందులో ఇప్పటికి నాలుగు వారాలకు గాను నాలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రావు, షకీలా, దామిని, రతిక వెళ్లిపోగా.. ఈ రోజు ఆదివారం ఐదో వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసేసారు. ఆదివారం అక్టోబర్ 8 ఎపిసోడ్ ని 7 గంటలకే మొదలు పెట్టిన నాగార్జున ఎలాంటి టాస్క్ లు కానీ, ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండానే ఏడుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేసేసారు.
అందులో గౌతమ్-శుభశ్రీల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటే.. బాటమ్ 3 చివరిలో ఉన్న శుభశ్రీని ఎలిమినేట్ చేసేసారు. అంటే వరసగా ఐదుగురు అమ్మాయిలు హౌస్ నుంచి బిగ్ బాస్ చరిత్రలోనే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. శుభశ్రీ గ్లామర్ గా ఉన్నా ఆమెకి తెలుగు రాకపోవడం, టాస్క్ లు అర్ధం చేసుకోకపోవడమే ఆమెపై నెటిజెన్స్ నెగిటివిటి చూపించేలా చేసాయి.
ఇక శుభశ్రీ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోగా హౌస్ లో తొమ్మిదిమంది మాత్రమే మిగిలారు. ఈరోజు ఎపిసోడ్ లో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో సిద్దార్థ్, రవితేజలు బిగ్ బాస్ స్టేజ్ పై సందడిచేసారు. మరి హౌస్ లోకి వెళుతున్న ఆ ఐదుగురు ఎవరో మరో అప్ డేట్ లో..