అనసూయ వెండితెర మీదేకాదు బుల్లితెర మీద నటించినప్పుడు సోషల్ మీడియాకి దగ్గరగా ఉండేది. తన ఫోటో షూట్స్ తో యూత్ ని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసేది. సోషల్ మీడియాలో వారానికో ఫోటో షూట్ షేర్ చెయ్యకపోతే అనసూయకి అసలు నిద్రే పట్టదు జబర్దస్త్ లో అయితే గురువారం గురువారం కొత్త కొత్త అవుట్ ఫిట్స్ తో కనిపించే అనసూయ ఇప్పుడు బుల్లితెరని పక్కనపెట్టేసింది.
వెండితెర మీద వెలుగొందుతున్న అనసూయ రీసెంట్ గా పెద్దకాపు 1 తో ప్రేక్షకుల ముందు రాగా.. ఆమె ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తరచూ శారీ ఫొటోస్ షూట్స్ షేర్ చేస్తూ హంగామా చేస్తున్న అనసూయ గత రెండు రోజులుగా మోడ్రెన్ డ్రెస్సులతో చూపరులని కట్టిపారేస్తుంది.
తాజాగా అనసూయ బేబీ పింక్ డ్రెస్ తో దిగిన ఫొటోస్ షేర్ చేసింది. లేలేత గులాబీలా.. ఇప్పుడిప్పుడే పరిమళిస్తుందా అనెంతటి ఫ్రెష్ గా అనసూయ ఆ పిక్స్ లో కనిపించింది. క్యూట్ గా స్వీట్ గా చాలా అంటే చాలా అందంగా కనిపించింది. తన అల్లరి చేష్టలతో అనసూయ మరోసారి తన బ్యూటిఫుల్ లుక్స్ తో అందరిని పడేసింది.