కొద్దిరోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేదు.. అలాగే సినిమా షూటింగ్స్ లోను కనిపించడం లేదు. ఖుషి మూవీ విడుదల తర్వాత ఒక్కరోజు మాత్రమే హైదరాబాద్ లో కనబడిన సమంత ప్రస్తుతం విదేశాల్లో ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉండేది. కానీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాకి కూడా బ్రేకిచ్చింది.
తాజాగా పింక్ మోడ్రెన్ శారీ లో సమంత గ్లామర్ గా మెరిసిపోయింది. సమంత అభిమానులు సైతం ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కనిపించవు సామ్ అంటూ ఎగ్జైట్ అవుతున్నారు. దుబాయ్ లో ఓ జ్యువెలరీ షాపింగ్ ఓపెనింగ్ లో పాల్గొన్న సమంత ఫొటోలకి ఫోజులిచ్చింది. దుబాయ్ లోని నిష్క జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ లో సమంత పాల్గొంది.
ప్రస్తుతం సమంత పింక్ శారీ పిక్స్ వైరల్ గా మారగా.. ఖుషి మూవీ లో లుక్స్ వైజ్ గా విమర్శలు ఎదుర్కున్న సమంత ఇప్పుడు ఈ లుక్ లో ఫ్రెష్ గా కనిపించింది. మోడ్రెన్ గా గ్లామర్ ఒలకబోసింది. ప్రస్తుతం సమంత ఎలాంటి కథలు వినడం కానీ, కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం కానీ చెయ్యడం లేదు.