లోకేష్ LCU లోకి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంటర్ కాబోతున్నారనే న్యూస్ ఎప్పటినుంచో నడుస్తుంది. తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తూ అదిరిపోయే బిగ్గెట్స్ హిట్స్ కొడుతున్న లోకేష్ కనగరాజ్ పేరు విక్రమ్ మూవీతో మార్మోగిపోయింది. ప్రస్తుతం లియో తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న లోకేష్ తాజాగా లియో ప్రమోషనల్ ఇంటర్వూస్ లో బిజీగా వున్నాడు.
అందులో భాగంగానే ప్రభాస్ మూవీపై లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ప్రభాస్ తో మూవీ ఉంటుంది అని చెప్పాడు. కానీ లోకేష్ తో ప్రభాస్ మూవీ ఇప్పుడప్పుడే సాధ్యం కాదంటూ సమాచారం. లియో తర్వాత లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ మూవీకి కమిట్ అవ్వగా.. తర్వాత ఖైదీ 2, కమల్ హాసన్‌తో విక్రమ్ 2 చేయాలి. ఈ సినిమాలకు సంబంధించిన కథ ఉన్నప్పటికీ.. ఫుల్ వెర్షన్ ఇంకా డెవలప్ చేయాలట. రోలెక్స్ సోలో క్యారెక్టర్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు లోకేశ్. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవ్వడానికి మరో నాలుగేళ్లు పడుతుంది. ఇవన్నీ లోకేశ్ యునివర్స్ పేరుతో తెరకెక్కనున్నాయి.
మరోపక్క ప్రభాస్ సలార్ 1, 2 భాగాలూ, కల్కి రెండు భాగాలంటున్నారు, మారుతి మూవీ, స్పిరిట్ ఇంకా హను రాఘవపూడి మూవీ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ కావాలి, సో లోకేష్ కనగరాజ్-ప్రభాస్ కలిసి సినిమా సెట్స్ మీద కనిపించాలంటే మరో నాలుగైదేళ్ళ గ్యారెంటీగా పడుతుంది. మరి ఇది ప్రభాస్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ కాక ఇంకేమవుతుంది.