Advertisementt

చిరు-వసిష్ఠ మూవీ రిలీజ్ డేట్

Sun 08th Oct 2023 10:35 AM
chiranjeevi  చిరు-వసిష్ఠ మూవీ రిలీజ్ డేట్
Chiru-Vasishta Movie Release Date చిరు-వసిష్ఠ మూవీ రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-బింబిసార దర్శకుడు వసిష్ఠ కలయికలో నవంబర్ లో మొదలు కాబోతున్న మెగా 157 మూవీ కి సంబంధించిన రిలీజ్ అప్పుడే అంటూ సోషల్ మీడియాలో కనిపించే న్యూస్ చూసి మెగా అభిమానులకి పూనకలొచ్చేస్తున్నాయి. మెగా 156 ఏ దర్శకుడితో అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ.. వసిష్ఠ తో మెగా 157 తో ముందుకెళ్లేందుకు మెగాస్టార్ చిరు రెడీ అవుతున్నారు. 

ప్రస్తుతం మోకాలి ఆపరేషన్ తర్వాత రెస్ట్ లో ఉన్న చిరు ఆయన తన ఇంట్లోనే ఫిజియోథెరపీ అవి చేయించుకుంటున్నారు. ఇక నవంబర్ లో వసిష్ఠ తో మూవీ మొదలు పెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి మరో ఆరు నెలల పాటు వసిష్ఠ సీజీ వర్క్ కోసం కేటాయిస్తారని తెలుస్తోంది. 

ఈ చిత్రం పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతుంది. అందుకే విఎఫెక్స్ వర్క్స్ కి ఎక్కువ సమయం కావాలని, దాని కోసమే ఆరు నెలలు కేటాయించి.. 2025 సంక్రాంతికి మెగా మూవీతో ఆడియన్స్ ముందుకు రావాలని వసిష్ఠ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Chiru-Vasishta Movie Release Date:

Chiru-Vasishta Movie head for release only during 2025 Sankranthi

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ