హీరో నవదీప్ ని డ్రగ్స్ కేసు ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నవదీప్ ని మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారించడమే కాకుండా.. ఇప్పుడు మరోమారు విచారణకు హాజరావాల్సిందిగా నోటీసులు పంపించింది. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని ఈడి నవదీప్ కి నోటీసులు ఇచ్చింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా బెంగళూరులో పట్టుబడిన నైజీరియన్లతో నవదీప్ కు కనెక్షన్ ఉందని ఈడీ నవదీప్ ని విచారించేందుకు మరోసారి రంగం సిద్ధం చేసింది.